శ్రీ వల్లభాచార్య ముని జన్మతః తెలుగు బ్రాహ్మణులు, చైతన్య మహాప్రభువుకు సమకాలీకులు. వీరిని అగ్ని దేవుడి అవతారంగా భావిస్తారు. రాజస్థాన్, గుజరాత్ లలో వైష్ణవ మతాన్ని వీరే స్ధాపించారు. వీరు గొప్ప పండితులు, దీవింపబడిన మేధావి. 12 ఏళ్ళ వయసుకే వేదాధ్యయనం పూర్తి చేసారు. కృష్ణ భగవానుడిని పురుషోత్తముడిగా కొనియాడతారు, శ్రీ వల్లభాచార్య కృష్ణ నామం పట్ల ఆకర్షితులై ఆయనకు సంబంధించిన 1075 లీలా గుణాలను శ్రీ పురుషోత్తమ నామ సహస్రంగా రాసారు.
“శ్రీమద్భాగవతమును పూర్తిగా పారాయణ చేస్తే కాని, ప్రసాద స్వీకారము చేయను” అని సంకల్పించుకున్న వల్లభాచార్యుల కుమారుడు ఆ కఠిన నియమ పాలన చెయ్యలేక, బాధపడుతూ ఉండగా, ఆచార్యుల వారు శ్రీమద్భాగవతము నుంచి వెయ్యి అమూల్య రత్నాల వంటి నామాలను వెలికి తీసి, సంస్కృతంలో “పురుషోత్తమ నామ సహస్రము” అనే గ్రంథ రచన చేసి, తన కుమారుడికి ఇచ్చారు. ఈ సహస్రానామానికి శ్రీ రఘునాథుల వారు “నామ చంద్రిక” అనే సంస్కృత వ్యాఖ్యను వ్రాసారు. దానికి తెలుగు అనువాదమే – శ్రీ బలిజపల్లి వేంకట శ్రీరామచంద్రమూర్తి గారు వ్రాసిన ఈ పుస్తకం. రోజూ ఈ సహస్రానామాన్ని చదివితే, నిశ్చయంగా భాగవత పారాయణ చేసిన ఫలం లభిస్తుందని ఆచార్యులవారు తెలిపారు.
ఈ అమూల్య గ్రంథ రత్నాన్ని కొనండి, చదవండి.
Sri Purushottama Naama Sahasram - శ్రీ పురుషోత్తమ నామ సహస్రం
రచన: బలిజపల్లి వేంకట శ్రీరామచంద్రమూర్తి
పేజీలు : 382
ప్రచురించిన సంవత్సరం- 2009
ప్రచురించిన సంస్థ- self
ధర : 150 రూ.