
Product details
తెలుగులో పంచకావ్యాలు చాలా విశిష్టమైనవి. కానీ తెలుగు భాషలో ఎం.ఎ తెలుగు, ఇతర కోర్సులు చేస్తున్న ప్రస్తుత తరానికి ఇవన్నీ సులభ తెలుగులో అందుబాటులో లేవు. డెబ్బై సంవత్సరాల వయసులో నిత్య కృషీవలునిలా సాహితీ సేద్యం చేస్తూ, ఈ పంచకావ్యాలను, వాటిలోని మాధుర్యాన్ని భావితరాలకు సరళమైన తెలుగులో అందించాలని సంకల్పించుకున్నారు శ్రీ బాలాంత్రపు వేంకట రమణ గారు. ఇప్పటికే మనుచరిత్రము, పాండురంగ మహాత్మ్యం, పారిజాతాపహరణము అనే మూడు పరిచయ కావ్యాల పుస్తకాలు ముద్రించిన వీరు, మనకు అందిస్తున్న మరొక పెన్నిధి ‘వసుచరిత్రము- పరిచయము’.
తెలుగులో వసుచరిత్రము గురించిన పుస్తకాలు పెద్దగా అందుబాటులో లేవు. ఎందుకంటే, ఇతర కవుల రచనలు ఒకెత్తు, రామరాజభూషణుడి కవిత్వం ఒకెత్తు. ఈతని శ్లేష కవిత్వంలో ప్రతీ పద్యానికీ రెండు అర్ధాలుంటాయి. వాటిని విశ్లేషించి, అహర్నిశలూ శ్రమించి, మూడువందల పద్యాలు, వివరణలతో, ఇటువంటి పుస్తకం తీసుకురావడమంటే మాటలు కాదు. చక్కని ఈ పుస్తకాన్ని తప్పక కొని చదవండి.
Vasu Charitramu Parichayamu - వసు చరిత్రము పరిచయము
రచన: బాలాంత్రపు వెంకట రమణ
పేజీలు : 280
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- అచ్చంగా తెలుగు ప్రచురణలు
ధర : 300 రూ.
Similar products