
Product details
#acchamgatelugupublications
Book.no.95
ది క్రష్ ఇన్
ఉషారాణి కందాళ
“లోహిత్! నన్నాపడం నీ తరం కాదు!” – కిడ్నాపర్.
ఆ సిటీలోకే పెద్ద ఫైఫ్ స్టార్ హోటల్ – ది క్రష్ ఇన్. అక్కడ బసచేసిన అందమైన అమ్మాయిలంతా కిడ్నాప్ అవుతున్నారు. ఎంత వెతికినా ఆ కిడ్నాపర్ ను పట్టుకోవడం కష్టమవుతోంది. అసలా అమ్మాయిలంతా ఏమవుతున్నారు?
ప్రతీ ఏటా ఆ హోటల్లో “భాగ్యనగర్ బ్యూటీ కాంటెస్ట్” పేరుతో అందాల పోటీలు విశేషంగా జరుగుతాయి. కానీ అందమైన అమ్మాయిలు మాయమవుతున్న ఈ స్థితిలో అసలక్కడ పోటీలు నిర్వహించడం ఎలాగో తెలీక సతమతమవుతున్నాడు ఆ హోటల్ యజమాని ‘లోహిత్’.
***
గుమ్మంలోకి అడుకు పెట్టగానే గదిలో కూర్చున్న లోహిత్ కనిపించాడు.
అడుగుల చప్పుడు విని కళ్ల కడ్డంగా పెట్టుకున్న చెయ్యి తొలగించి చూశాడు.
ఎదురుగా నీరద. కళ్ళూ కళ్ళూ కలిసి ముడిపడ్డ చూపులు,
నీరద గుండె ఎందుకో లయ తప్పింది. ఏముంది లోహిత్ కళ్ళల్లో..?
గుండెకు గాలం వేసి తనవైపుకు లాక్కుని ఎదుటి మనిషికి ఏమీ మిగలనివ్వకుండా చేసే సూదంటు రాయిలాంటి చూపు.
నీరదే కలవరపడి కళ్ళు వాల్చుకుంది. నీరద లోహిత్ పేరు వింటే తప్ప అతన్నెప్పుడూ చూడలేదు. ప్రస్తుతం తన ఎదురుగా వున్నది లోహిత్ అన్నది ఆ అమ్మాయికి తెలియనూ తెలియదు!
****
ప్రేమ, సస్పెన్స్, మానవీయ ఉద్వేగాలను అద్భుతంగా మేళవించి, చివరికంటా చదివించే నవల – ‘ది క్రష్ ఇన్’ – ప్రముఖ రచయిత్రి ఉషారాణి కందాళ గారి కలం నుండి జాలువారి, మీకోసం ఎదురుచూస్తోంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ నవలను తప్పక చదవండి.
The Crush Inn - ది క్రష్ ఇన్
రచన: ఉషారాణి కందాళ
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీల సంఖ్య: 200
ధర: 200rs
Similar products