Product details
మనిషి జీవితం పరమసత్యాన్ని చేరుకోవడానికే అంటారు కదా! మరి ఆ సత్యమేమిటి? దాన్ని చేరుకోవడం ఎలా?
విలాసవంతమైన జీవితంలో కూడా ఆమె మనసులో ఏదో లోటు, తృష్ణ… గురువులేని జీవితం చుక్కాని లేని నావ వంటిది కదా, మరి సత్యాన్ని చూపే సజీవమైన సద్గురువు లేనప్పుడు నా జీవితం వ్యర్ధం కదా అన్న తపన ఆమెను నిలువనీయలేదు. ఆ సత్యాన్ని అన్వేషిస్తూ, అమెరికా నుంచి భారతావనికి వచ్చి, ఆసేతుహిమాచల పర్యంతం ఒంటరిగా పర్యటిస్తూ జపాలు, దానాలు కొనసాగించింది. ఆమె పయనంలో ఎన్నో అనుభవాలు… కొన్ని అద్భుతాలు, కొన్ని అవరోధాలు, కొన్ని ఛీత్కారాలు… అన్నిటినీ తట్టుకుని, ఓర్చుకుని దైవంపై కొండంత నమ్మకమే ఆసరాగా నిలబడ్డ ఆమెకు చివరికి సద్గురు అనుగ్రహం లభించిందా? అడుగడుగునా ఉత్కంఠత రేపే సంధ్య యల్లాప్రగడ గారి ఈ అనుభూతుల సమాహారాన్ని మీరూ కొని చదవండి.
Satyanveshana - సత్యాన్వేషణ
రచన: సంధ్య యల్లాప్రగడ
పేజీలు : 264
ప్రచురించిన సంవత్సరం- డిసెంబర్ 2021
ప్రచురించిన సంస్థ- అచ్చంగా తెలుగు ప్రచురణలు
ధర : 200 రూ.
Similar products