Search for products..

Home / Categories / Akshagna Publications /

Ramaneeya Sri Bhagavatam - Dashavataralu

Ramaneeya Sri Bhagavatam - Dashavataralu




Product details

శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారికి ‘అక్షరాలా’ సహచరి అనదగిన సతీమణి శ్రీమతి ముళ్ళపూడి శ్రీదేవి గారు.

జన్మతః వచ్చిన భగవద్భక్తి, రచనానురక్తి రమణగారి సాన్నిహిత్యంతో ద్విగుణీకృతమైంది.

నాయనమ్మ వంటి ఒక పెద్దావిడ కథ చెబుతుంటే, కథలంటే చెవులు కోసుకునే పిల్లలు ఆమె చుట్టూ చేరతారు. మధ్య మధ్యలో వాళ్ళు సినిమాలు, నాటకాలు చూసి బుర్రకెక్కించుకున్న సందేహాల్ని ఆమె ముందు కుమ్మరిస్తుంటారు.

“ధర్మం అంటే ఏమిటి?”

“ప్రజాపతి అంటే ఎవరు? ఎంతమంది ఉంటారు?”

“ప్రతిసారీ రాక్షసులనే చంపి, దేవతల్ని ఎందుకు కాపాడాలి? దేవతలు తప్పు చేయరా? రాక్షసుల్లో మంచి వాళ్ళు ఉండరా?”

“సీత హాయిగా హనుమంతుడి భుజం మీద ఎక్కి రాముడి దగ్గరకు వెళ్ళిపోయి ఉండచ్చు గదా!”

“కంసుడు దేవకికి పుట్టిన ఎనిమిదో బిడ్డని మాత్రమే చంపితే సరిపోయేది కదా! పుట్టిన వాళ్ళందర్నీ ఎందుకు చంపాడు?”

ఇటువంటి అనేక సందేహాలు పిల్లలకే కాదు, ఇతిహాసాలు చదివే ఓపిక, అవకాశాలు లేక, టీవీల్లో సీరియళ్లు మాత్రమే చూసే పెద్దవాళ్ళక్కూడా వస్తూనే ఉన్నాయి.

శ్రీదేవి గారు ఈ ప్రయోగంలో రాసింది పోతనగారి భాగవతమే అయినా, అది చదువుతుంటే కలిగే అన్నిరకాల, అన్ని వయస్సుల వారి సందేహాలకు పండిత ప్రమాణాలను అనుసరించి, ఇతిహాసాల మూలాలనుంచి సేకరించిన సమాధానాల్ని సందర్భోచితంగా వివరిస్తూ రావటం ఈ రచనను సుసంపన్నం చేసింది. బాపు గారి బొమ్మలు ఈ పుస్తకానికి మరొక సొగసు. తప్పక కొని, చదవండి.

Ramaneeya Sri Bhagavatam - Dashavataralu

రమణీయ శ్రీ భాగవతం - దశావతారాలు

Author: Mullapudi Sridevi

No.of pages: 364

Year of Publication: 2022

Published by: Akshagna Publications

Price: 350rs

 


Similar products


Home

Cart

Account