Search for products..

Home / Categories / Novels /

Prema ! Ekkada Ni Chirunama?

Prema ! Ekkada Ni Chirunama?




Product details

అతని పేరు శ్యాం. ఆరడుగుల అతని అందమైన రూపం చూసి, తనపై కవితలు వ్రాస్తూ తన చుట్టూ తిరిగే పద్ధతి చూసి, గిటార్ వాయిస్తూ అతను పాడే పాటలు విని, అతడిని మనసారా ప్రేమించింది బాంధవి. కానీ ఆ రూపం వెనుక ఉన్న కుటిలత్వాన్ని ఆమె తెలుసుకునేసరికి… చాలా ఆలస్యమైపోయింది. అనుకోని పరిస్థితుల్లో తాను ప్రేమించిన శ్యాంని తన చేతులతోనే చంపేసి హంతకిగా మారింది. అంతులేని సంపద ఉన్నా, రాజహంస లాంటి రూపం ఉన్నా, ఆమె జీవితాంతం కటకటాల వెనుక మగ్గిపోవాల్సిందేనా?

అన్నెం పున్నెం తెలియని అమాయకమైన ఆ ఆడపిల్ల జీవితం ఏమైంది? చివరికి ఆమె కోరుకున్న నిజమైన ప్రేమ ఆమెకు దక్కిందా? నాటకీయమైన మలుపులతో, ఉత్కంఠభరితమైన కథనంతో, పట్టుసడలని శైలితో… కోయిలమ్మ, ఎన్నెన్నో జన్మల బంధం,రాధమ్మ కూతురు వంటి సెన్సేషనల్ టివి సీరియల్స్ రైటర్ ఉషారాణి కందాళ గారు వ్రాసిన నవల ‘ప్రేమా! ఎక్కడ నీ చిరునామా?’ తప్పక చదవండి.

గమనిక: ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే డబ్బంతా ‘విశ్వహిత ఛారిటబుల్ ట్రస్ట్’ కు ఇవ్వబడుతుంది‌

పుస్తక ప్రేమికుల కోసం ఇతర వివరాలివిగో:
పుస్తకం పేరు: ప్రేమా! ఎక్కడ నీ చిరునామా?
రచన: ఉషారాణి.కె
కవర్ డిజైన్: ఆర్టిస్ట్ రాంప్రతాప్
డిటిపి: విజయ్, కొల్లాపూర్
పేజీలు : 196
ప్రచురించిన సంవత్సరం- మే 2022
ప్రచురించిన సంస్థ- అచ్చంగా తెలుగు ప్రచురణలు
ధర : 200 రూ.(పోస్టల్ 50rs అదనం)

కొనుగోలుకు 8558899478(WhatsApp only) కు సంప్రదించగలరు.

Prema Ekkada Ni Chirunama?

ప్రేమా! ఎక్కడ నీ చిరునామా?

Year of publication: 2022

Author: K. Usharani


Similar products


Home

Cart

Account