
Product details
బాల సాహిత్యంలో పిల్లల కథల సంపుటి ‘ప్రకృతిమాత’ . ఇందులో పదిహేను కథలున్నాయి.
ప్రకృతిని కాపాడుకోనిదే మున్ముందు మనిషికి మనుగడ లేదని చాటి చెప్పే కథలు మూడు ఉన్నాయి. అందులో ఒక కథ ‘ప్రకృతిమాత’కు ‘అచ్చంగా తెలుగు’ అంతర్జాల మాస పత్రిక నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతి వచ్చింది.
మనిషికి ఆశ సహజమే కాని ‘అత్యాశ’ పనికి రాదనీ, చిన్న పిల్లల మనఃస్తత్వంపై ‘ఇంద్రజాలం’ కథ ఇంకా రాజుల కథలు, స్త్రీ విద్య ఆవశ్యకత గురించి ‘వేలి ముద్ర’ మొదలగు కథలు పిల్లలనే గాకుండా పెద్దలను సైతం విజ్ఞానాత్మక బాటలో పయనింప జేస్తాయి.
‘కథా చిత్రాలు’ పేరున ప్రముఖ బాలసాహితీ వేత్త డా.పత్తిపాక మోహన్ గారు ముందు మాటగా వ్రాస్తూ.. కథల ప్రాశస్త్యాన్ని వివరించారు. రచయిత ముఖ చిత్రంతో బాటు కథలకూ బొమ్మలు గీచుకోవడంలో దిట్ట అని ప్రశంసల ఝల్లు కురిపించారు.
చదవండి.. చదివించండి. *
ప్రకృతి మాత ( పిల్లల కథలు)
రచయిత: చెన్నూరి సుదర్శన్
పేజీలు : 120
ప్రచురించిన సంవత్సరం : 2018
ప్రచురించిన సంస్థ : శోభా సాహితీ ప్రచురణలు
ధర : 80/-
Similar products