Search for products..

Home / Categories / Novels /

Pipasi - పిపాసి

Pipasi - పిపాసి




Product details

ప్రతి మనిషి జీవితం అనేక సంఘర్షణల సమాహారం….
అందులో కొన్ని కలల్లా ఆలా వచ్చి ఇలా వెళ్ళిపోతే….
మరికొన్ని కలలుగా రూపాంతరం చెంది శాశ్వతమౌతాయి….
ఈ కళే ప్రపంచం తలా వంచే కళాకారున్నీ తయారు చేస్తుంది..
ప్రతి కళాకారుడు జీవితం కలలతోనే ప్రారంభమౌతుంది…
కొన్ని కలలుగా మిగిలితే మరికొన్ని కళలుగా ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకుంటాయి.
అలాంటి కలల్ని కళలుగా చేసుకుని ఎదగాలనుకునే జీవితాల తపనే ఈ పిపాసి నవల.
మరదలి ప్రేమను ఆలంబనగా చేసుకుని తన కళను సాకారం చేసుకోవాలనుకునే బావ తపన..
గుర్తింపునిచ్చిన కళకి అంకితమై దాన్ని వదులుకోలేని నిస్సహాయ సాహిత్య ఉద్యమకారుడు పడే తపన…
కళ కారణంగా తండ్రిని, తండ్రి కారణంగా తల్లిని కోల్పోయాననే భావనతో ఉండే ఓ కొడుకు తపన…
శరీరం కాదు మనసే ముఖ్యమనుకునే ఓ ప్రేమికుడి తపన…
భార్య నుంచి ఏది ఆశించకుండా ప్రేమించే ఓ భర్త తపన….
సంఘం ముందు ఒకలా మాటున ఒకలా ఉండే ముసలమ్మ తపన…
ఎవరి జీవితాలు వారివే అయినా అందర్నీ ఒక్కటి చేసేది మాత్రం కళే.
తమ తమ జీవితాల్లోని తపన వారిని ఏ దిశగా నడిపించింది? వారంతా తమ కళతో ఏ దరి చేరారు?
ఈ అంశాలను కళాత్మకంగా ఏర్చి కూర్చి…
రచయిత కళతో కలగలిపి మీ ముందు ఈ జీవితాలను ఆవిష్కరించేదే పిపాసి నవల.

ఈ నవల పాఠకుల్ని హర్షింపజేయడంతో పాటు
కళాకారుడి మనస్సుకు హత్తుకుంటుందని ఆకాంక్షిస్తూ…

Pipasi - పిపాసి

రచన: సత్యవోలు కిరణ్ కుమార్

పేజీలు :  216

ప్రచురించిన సంవత్సరం- 2018

ప్రచురించిన సంస్థ-  వాసిరెడ్డి ప్రచురణలు

ధర : 150 రూ


Similar products


Home

Cart

Account