
Product details
వయోలిన్ అనగానే గుర్తుకు వచ్చే పేరు శ్రీ అన్నవరపు రామస్వామి. కర్ణాటక సంగీతరంగంలో ఆయన పేరు తెలియని వారు ఉండరు. ఓ పల్లెటూరులో గేదెలు కాచుకునే దశ నుంచి ఒక్కో మెట్టూ ఎక్కుతూ జాతీయ, అంతర్జాతీయ వేదికపై తన కమాన్ విన్యాసాలతో శ్రోతలను మైమరపించిన ఘనతను సొంతం చేసుకున్న ప్రతిభామూర్తి ఆయన. ఎంతటి ప్రతిభా సంపన్నుడో అంతటి వినయమూర్తి కూడా. వయస్సు 95 దాటుతున్నా నేటికీ నిత్యం ఐదు గంటలైనా సాధన చేస్తారు. అన్నిటినీ మించి ఆయన గురుభక్తి అపారం. తన శిష్యుల పాలిట ఆయన కొంగుబంగారు. చదువుతో పాటు వారికి జీవితాన్నిచ్చిన అరుదైన గురువు శ్రీ రామస్వామి. ఆ మహనీయుడి జీవితచరిత్రకు అక్షరరూపం ఈ పుస్తకం.
O Violin Katha - ఓ వయోలిన్ కథ
రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
పేజీలు : 104
ప్రచురించిన సంవత్సరం: 2020
ప్రచురించిన సంస్థ : శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్
ధర: రూ. 207
Similar products