Product details
ఈ మధ్యకాలంలో అత్యుత్తమ నాణ్యతతో, సమున్నతమైన పరిణితితో కూడిన భావాలతో, వర్క్ చేస్తుండగానే నా మనసు దోచుకున్న కథలివి. సమాజం పట్ల, కుటుంబం పట్ల నిబద్ధత ఉన్న ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన కథలివి. “ఏమిటంత గొప్ప?” అంటారా. ఈ కథల్లోంచి కొన్ని వాక్యాలు చదవండి.
“తరచి చూసుకుంటే నా వలన ఎదుటి వారికి జరుగుతున్న మంచి గానీ, సమాజ శ్రేయస్సు గానీ ఏమీ కనబడటం లేదు. ఎదుటి వారికి హాని చేయకపోవడం ఏదో గొప్ప విషయం అని ఫీలయిపోవడం మినహా, సాటి మనిషి చిన్న చిన్న సంతోషాలకు కూడా నేను కారణం కాకపోవడం ఖచ్చితంగా నా తప్పే. నాలాగా తామెంతో మంచివాళ్ళని భావించుకునే వాళ్ళు కోకొల్లలు. ఊహు… నేను మంచిదాన్ని కాను. కాస్తైనా నన్ను నేను మార్చుకోవాలి. ఆ మార్పుకు రేపే శ్రీకారం చుట్టాలి” అని అనుకుంటూనే అలాగే నిద్ర లోకి జారిపోయాను. – ఓ ఉద్యోగిని ఆత్మావలోకనం.
“నాన్న! ఆస్తిలో నాకు భాగం అవసరం లేదు. నేను బ్రతికినన్ని రోజులు నా పుట్టింటికి స్వేచ్చగా వచ్చి వెళ్ళడమే నాకు కావాలి. నేను వచ్చినపుడు మీరు ఆప్యాయంగా ఆదరిస్తున్నారు. అది చాలు. ఎంతో మంది కూతుర్లు తమ వాటాలు అమ్ముకుని, పుట్టిల్లు లేకుండా చేసుకుని బాధ పడటం నాకు తెలుసు. అలాంటి ఖర్మ నాకు పట్టనీయకండి.” స్థిరంగా అంటుంది ఓ కూతురు.
చదువుల్లో పైకిరావాలని చిన్న పిల్లలను హాస్టళ్లలో వేసే తల్లిదండ్రులకు కనువిప్పు వంటి వాక్యాలివి…
“ఈ పసివయసులో పెద్దల్ని ఎదిరించలేని నిస్సహాయత లోంచి రేపు ఎవరి మాట వినని మొండివాడు తయారు కావచ్చు. ఆ నిర్లిప్తత లోంచి తల్లిదండ్రులయందు దయలేని పుత్రులు పుట్టుకురావచ్చు. లేక మనమెవరం గుర్తించలేని ఒక అసాంఘిక శక్తి గా కూడా మారవచ్చు.ఇవేవీ కాక చదువుల ఒత్తిడి తట్టుకోలేక తమ జీవితాలను తామే అంతం చేసుకోవచ్చు. పసి హృదయాలు ప్రేమాభిమానాల మధ్య ఎదగాలి కాని అభద్రత, ఆందోళనల మధ్య కాదు. ప్రేమ రాహిత్యంతో తయారైన యువత ఆ ఇంటికే కాదు…. సమాజానికి కూడా చేటే.” – అనుకుని ఓ తల్లి బిడ్డను హాస్టల్ నుంచి వెనక్కి తెచ్చేస్తుంది.
ఇలాంటి అద్భుతమైన మాటలు ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. కేవలం ఐదు రోజుల్లో ఈ పుస్తకం వెయ్యి కాపీలు వేసి రచయిత్రి ఊరికి పంపడం జరిగింది. ఇందుకు సహకరించిన మా డిటిపి తమ్ముడు విజయ్ కు, ఇతర టీంకు కృతజ్ఞతలు.
పుస్తక ప్రేమికుల కోసం ఇతర వివరాలివిగో:
పుస్తకం పేరు: నేను మంచిదాన్నేనా?
రచన: రామిగాని ఉమాదేవి
కవర్ డిజైన్: ఆర్టిస్ట్ నాగేంద్ర బాబు
డిటిపి: విజయ్, కొల్లాపూర్
పేజీలు : 120
ప్రచురించిన సంవత్సరం- మే 2022
ప్రచురించిన సంస్థ- అచ్చంగా తెలుగు ప్రచురణలు
ధర : 150 రూ.
Nenu Manchidannena?
నేను మంచిదాన్నేనా?
Author: Umadevi Ramigani
Similar products