
Product details
ఆబాలగోపాలానికి ఆహ్లాదదాయకంగా నిలుస్తుంది నీరు. చిన్నప్పుడు చెరువుల వద్దనో, చెలమల వద్దనో, కాలువల వద్దనో, వాగుల వద్దనో, జలపాతాల వద్దనో, నదుల వద్దనో, సముద్రం వద్దనో ఆడుకున్న మధురానుభూతులు ప్రతి ఒక్కరి హృదయంలో పదిలంగా దాగి ఉంటాయి.
ముఖ్యంగా నదులు పలు నాగరికతలకు ఆలవాలాలు. ప్రముఖ నదుల గురించి మనకు తెలిసినా, శారద, బహుదా, పెన్నా, స్వర్ణముఖి, నాగావళి, చిత్రావతి, గుండ్లకమ్మ వంటి నదుల పుట్టుపూర్వోత్తరాల గురించీ, వాటి ఒడ్డున విలసిల్లిన నాగరికతల గురించి మనకు తెలీదు. అందుకే చిన్న నదులనే ఇతివృత్తంగా తీసుకుని, ఆకాశవాణి విశ్రాంత అధికారి శ్రీ రమణమూర్తి గారు ‘నదీప్రస్ధానం’ అనే అరుదైన పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం ద్వారా సంస్కృతి సంప్రదాయాలకు చెందిన అనేక విశేషాలను మీరు తెలుసుకుని, ఆయా నదులపై పయనించేటప్పుడు ఆ విశేషాలను మీపిల్లలకి కూడా చెప్పండి.
ధర:200rs
కొనుగోలు కోసం సంప్రదించాల్సిన వాట్స్ ఆప్ నెం. 8558899478
Nadee Prasthanam - నదీ ప్రస్ధానం
రచన: రామవరపు వేంకట రమణమూర్తి
పేజీలు: 176
ధర: 200rs
Similar products