Search for products..

Home / Categories / General Books /

Naagaladevi

Naagaladevi




Product details

ఒక చక్రవర్తి తాను మనసు పడ్డ మగువను ఆరాధించి, దశాబ్దం తరువాత మనువాడిన అరుదైన ఘటన… చరిత్రలో మరుగున పడింది. ఆ స్ఫూర్తి ప్రదాత విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు.

శ్రీకృష్ణదేవరాయలు అపురూపంగా ప్రేమించిన ఆ అదృష్టవంతురాలి పేరు నాగలాదేవి. ఈమె ఓ వేశ్య కుటుంబంలో పుట్టింది. అయితేనేం కళ్లు చెదిరే అందం, కళాభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసే నృత్యం ఈమె స్వంతం. అనుకోకుండా రాయలు నాగలాదేవిని నృత్యం చేస్తున్నప్పుడు చూశాడు. తొలి చూపులోనే ఆమెను ప్రేమించాడు. ఆమెతోనే జీవితం, జీవనం అనుకున్నాడు. అయితే ఆమెను వివాహం చేసుకుంటానంటే మహామంత్రి అప్పాజీ కాదన్నాడు. అంతఃపుర కాంతలు అభ్యంతరం తెలిపారు. మంత్రులు వారించారు. దళపతులు వలదన్నారు. అందుకే పరిస్థితులు అనుకూలించేదాకా కృష్ణదేవరాయలు మౌనం వహించాడు.

1509లో విజయనగర సామ్రాజ్యాధినేతగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమెను వివాహం చేసుకున్నాడు. 1510లో పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించుకున్నాక, అందరినీ కాదని తాను ఆరాధించిన నాగలాదేవిని వివాహం చేసుకొని చక్రవర్తిగా తన మాటను నిలబెట్టుకున్నాడు. వివాహానంతరం నాగలాదేవి పేరును చిన్నాదేవిగా మార్చాడు. అయినా కడదాకా ఆమె రాయల మనసులో నాగాలాదేవిగానే మిగిలిపోయింది.

దక్షిణాదిని ఏకచ్ఛత్రాధిపతుగా ఏలిన ఒక చక్రవర్తి… ఒక స్త్రీని ఎలా ప్రేమించాలో, ఎంత ఉన్నత స్థానంలో నిలపాలో, ఆమెలోని సామర్థ్యాలను గమనించి ఎలా ప్రోత్సహించాలో నిదర్శన పూర్వకంగా తెలిపిన అద్భుత గాథ ఇది. ప్రామాణికంగా, ఆధారాలతో సహా, మరుగున పడ్డ ఈ చారిత్రిక గాథను పరిశోధించి, అందమైన వర్ణనలు జోడించి, అద్భుతమైన బొమ్మలతో సహా మనకు అందించారు, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ గారు. అక్షరం నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా చదివించే ఈ అద్భుతమైన పుస్తకాన్ని తప్పక కొనుగోలు చెయ్యండి.

Naagaladevi - నాగలాదేవి

Author: G.Bhageeradha

No.of.pages: 272

Artist: Shiva Prasad

Published by: self

Price: 500rs


Similar products


Home

Cart

Account