
Product details
మౌనశ్రీ మల్లిక్ కవిత్వం పై సుప్రసిద్ధ సాహితీవేత్తల అభిప్రాయాలు
*
మౌనశ్రీ మల్లిక్ కవిత్వంలో అడుగడుగునా ప్రగతిశీలం పదును పదునుగా కనిపిస్తున్నది. నాలుగు పంక్తులలో నాలుగు పుటల కవిత్వ నైశిత్యం ఉన్నది.
~డాక్టర్ సి.నారాయణరెడ్డి
*
మౌనశ్రీ మల్లిక్ లో అన్ని విశ్వ దర్శనాలు ఇముడుతాయి. కవిగా అతడు పిల్లవాడు కాదు, లబ్ద ప్రతిష్ఠుడు. మానవజాతి వికాసం కోసం చేసిన పోరాటాలు. నాగరికత, చరిత్ర మౌనశ్రీకి తెలుసు.
~వరవరరావు
**
"శ్రీ శ్రీ కవిత్వాన్ని తూచడానికి తన దగ్గర తూనికరాళ్లు లేవు" అన్నాడు చలం. నా దగ్గర కూడా మౌనశ్రీ మల్లిక్ కవిత్వాన్ని తూచడానికి తూనిక రాళ్లంటూ ఏవి లేవు. త్వరలోనే ఆయన తెలుగు కవితా ప్రపంచంలో అగ్రశ్రేణి కవిగా వెలుగుతాడు.
~డాక్టర్ అంపశయ్య నవీన్
*
ముఖం నిండా వ్యాపించిన చిరునవ్వు, మృదుత్వం తొణికిసలాడే పలకరింపు ఇది మౌనశ్రీ మల్లిక్ ను కలవగానే కలిగే అనుభవం. ఆ రకంగా అతడు స్మితపూర్వాభిభాషి. కవిత్వం కన్నా ముందే అతని వ్యక్తిత్వం మనల్ని ఆకట్టుకుంటుంది.
~డాక్టర్ ఎన్. గోపి
*
మౌనశ్రీ మల్లిక్ కవిగా చాలామందికి అందనంత దూరంలో ఉన్నాడు.
~సుద్దాల అశోక్ తేజ
**
మౌనశ్రీ మల్లిక్ మనం మరిచిపోయిన పదాలను వెలికి తీసే అద్భుత కవి
~చంద్రబోస్
*
మౌనశ్రీ మల్లిక్ సాహిత్య రంగంలో ఈ స్థాయికి రావడానికి ఎన్ని రాళ్లపై నుండి జారిపడ్డాడో, జారిపడేసిన రాళ్లను ఎంత ఎత్తుగా ఎత్తాడో, ఎత్తిన ఆ రాళ్లు ఆయనను ఎంతగా మోసాయో, ఆయన జీవితాన్ని తరచి చూస్తేనే తెలుస్తుంది
~డాక్టర్ కె.వి. రమణాచారి
Similar products