Search for products..

Home / Categories / Spiritual Books /

Mahabharatamlo Jaanapada Kathamsha Kathalu - మహాభారతంలో జానపద కథాంశ కథలు

Mahabharatamlo Jaanapada Kathamsha Kathalu - మహాభారతంలో జానపద కథాంశ కథలు




Product details

నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ వ్రాసిన భారతానికి, చాలామంది కవులు తమ ఆలోచనలని చొప్పించి కల్పన చేశారు. వాటిని విడగొడుతూ “ఏవి కల్పనలు? ఏది కవిత్రయం యొక్క ఒరిజినల్?” అంటూ ఒక మంచి పుస్తకం ఈ మధ్య రిలీజయింది.
“ఉరిద్రెవ్వ గొరికి యిప్పుడు…” అంటూ ముంగిస, గుడ్లగూబల బారినుంచి తనని తాను కాపాడుకోవటానికి ఒక తెలివైన ఎలుక పిల్లితో ఏ రకంగా స్నేహం చేసిందనేది మహాభారతంలో తిక్కన ఏ విధంగా వర్ణించాడు? దాన్ని తరువాత వచ్చిన కవులు ఏ విధంగా “మరింత గొప్పగా” చిత్రీకరించారు? అని ఈ రచయిత తన పుస్తకంలో వివరించారు.
శత్రువు శత్రువుతో ఎటువంటి పరిస్థితులలో స్నేహం చేయాలన్న విషయమై పిల్లికీ ఎలుకకీ జరిగిన సంభాషణ ఇంతవరకూ నేను ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకంలోనూ చదవలేదు.
ఆచార్య ఎం. జయదేవ్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ తెలుగు హెడ్. మహాభారతం నుంచి దాదాపు 50 అద్భుతమైన కథలు సేకరించి పుస్తకంగా రూపొందించారు. ప్రతీ పేజీలోనూ ఈ రచయిత పడిన కష్టం తెలుస్తుంది. పిల్లలకి పది వారాలు ఈ కథలు చెప్పొచ్చు.
-ప్రముఖ రచయత యండమూరి వీరేంద్రనాథ్.

Mahabharatamlo Jaanapada Kathamsha Kathalu - మహాభారతంలో జానపద కథాంశ కథలు

రచన:   ఆచార్య ఎం.జయదేవ్ 

పేజీలు :  250

ప్రచురించిన సంవత్సరం- 2020

ప్రచురించిన సంస్థ-  అచ్చంగా తెలుగు ప్రచురణలు 

ధర: 150  రూ.


Similar products


Home

Cart

Account