
Product details
“పైరగాలికి ఊగుతూ, పలకరించే పచ్చని వరి చేలు ఒక పక్క , అంత ఎత్తు నుంచి ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపించే కొబ్బరి చెట్లు ఇంకో పక్క. ఆప్యాయత కి ఆదరణ కి చిరునామా మా గోదారోళ్ళు .
కొన్ని కథలు పడవలో తెర చాప వేసుకుని గోదారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరి కొన్ని కథలు కొబ్బరి రాట్లతో పందిరేసి మా ఊరి చుట్టూతా తిరుగుతా ఉంటాయి. ఇంకొన్ని కథలు మా ఊరి కొన్ని వందల సంవత్సరాల చారిత్రాత్మక ఘట్టాన్ని తెలియచేస్తాయి. అన్ని కథల పాత్రలు అక్కడే పుట్టి, పెరిగి అక్కడక్కడే తచ్చాడుతుంటాయి.
పుట్టీ, పెరిగిన ఊరు అంటే ఇష్టం లేని వారు ఉండరు. ఆ ఇష్టాన్ని, ఆ గోదారి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల దేగ్గెర జరిగిన కొన్ని విషయాలను కథల రూపం లో మీకు అందిస్తూ, మీరు ఆ కథలను తప్పక చదివి ఆనందిస్తారని అనుకుంటూ….
“ఆయ్ ! పడవ రెడీ గా ఉందండి గోదావరి రేవు దాటటానికి ..రండి ..కథల్లో కలుద్దాం….”
Maa Oori Kathalu - మా ఊరి కథలు
రచన: ప్రసాద్ ఓరుగంటి
No.of pages: 194
Price:200rs
Published by: Vanguri foundation of america
Similar products