Search for products..

Home / Categories / Spiritual Books /

Kathashilpam - కథాశిల్పం

Kathashilpam - కథాశిల్పం

per piece




Product details

మన ఆలయ శిల్పాలు ఒక్కసారి పలకరిస్తే బోలెడన్ని కథలు చెబుతాయి. ఆధునిక కాలంలో హడావుడిగా ఆలయాలను సందర్శించడమే కానీ, శిల్పసౌందర్యాన్ని ఆస్వాదించలేక బాధపడుతుండే వారికి కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య రూపొందించిన కథాశిల్పం ఒక చక్కని అనుభూతినిస్తుంది. ప్రతి శిల్పసౌందర్యాన్ని అక్షర బద్దం చేస్తూనే ఆ శిల్పం నిర్మాణం వెనుక కథను సైతం రచయిత పరిచయం చేశారు.ఇంద్రకీలాద్రి మల్లేశ్వరస్వామి విమాన గోపురం మీద శరభసాళువమూర్తి,
ధర్మగిరిలో బ్రహ్మ విగ్రహం, కర్ణాటక హలేబేడులోని కప్పచెన్నకేశవస్వామి కథ. కాశీ అన్నపూర్ణ కథ, తమిళనాడులోని సూర్యదేవాలయం ఇలా భారతదేశంలోని ఆలయ శిల్పాలన్నీ ఇందులో తడిమి చూపించారు. ఆయా దేవతామూర్తుల మహిమా విశేషాలను కథారూపంగానూ, రూపవర్ణనతోనూ, ధ్యానశ్లోక, చిత్రసహితంగానూ పొందుపరిచారు. ఇది ఎన్నదగిన కృషి. ప్రతి ఒక్కపాఠకుడూ చదివి దాచుకోవాల్సిన పుస్తకం.

కథాశిల్పం

రచన : కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమశాస్త్ర పండితులు

పేజీలు : 120

ప్రచురించిన సంవత్సరం-2020

ప్రచురించిన సంస్థ- కందుకూరి యామబ్రహ్మయాచార్య శిల్పవాఙ్మయపీఠం,

ధర: 100 రూ.


Similar products


Home

Cart

Account