కార్తీకమాసం కాశీక్షేత్ర యాత్ర
కాలం- దేశం రెండూ పవిత్రాలే. దేశకాలాల యోగాలను పండించుకుంటూ శ్రీమతి యల్లాప్రగడ సంధ్యగారు వారణాసిలో అనేక ప్రధాన దర్శనీయస్థలాలలో సంచరిస్తూ, పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉన్న మందిరాలు, ఘాట్లు, తీర్థాలు, ప్రదర్శన కేంద్రాలు… కావ్యాలలో, చరిత్రగ్రంథాలలో వాటికున్న ముఖ్యవిశేషాలను కూడా తెలుసుకొని ఆ అనుభవాలను చక్కని శైలిలో వారితోపాటు కాశీని సందర్శించిన అనుభూతి పఠితకు కలిగేలా రచించారు. కళ్ళకు కట్టినట్టు, మనసుకి హత్తుకునేట్టు ఒక్కొక్క దృశ్యాన్ని వర్ణించిన తీరు అభినందనీయం. ప్రవచనాల్లో విన్న అంశాలను, పుస్తకాల్లో చదివిన ఘట్టాలను తాను దర్శించినవాటికి అన్వయించుకుంటూ ఒక యాత్రాసాహిత్యంగా సులభశైలిలో వివరించారు.
– సామవేదం షణ్ముఖశర్మ
Karteekamlo Kashiyatra - కార్తీకంలో కాశీయాత్ర
రచన: సంధ్య యల్లాప్రగడ
పేజీలు : 212
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- Vanguri Foundation of America
ధర : 150 రూ.