
Product details
సంచార జాతి వారి జీవనం... వారు మజిలీ చేసే ఊరి పెద్దల తీరుపై ఆధారపడి ఉంటుంది. తల్లో నాలుకలో ఊళ్లో ఉన్న ప్రజలతో ఎంతగా కలిసిపోదామనుకున్నా, అంతా వీరిని వేరుగా చూస్తారే తప్ప వారిలో కలుపుకోరు.
కనీసం వీరిని మనుషులుగా కూడా చూడరు. అందుకే వీరి జీవికపైనే కాదు, చావుపుట్టుకలపై కూడా ఎన్నో ఆంక్షలు! ఈ నవల చదువుతూన్నప్పుడు... నిజమే కదా, అనిపించి, మనసును ద్రవింపజేసే సంఘటనలు ఎన్నో!
దొర దురాగతాలను ఒక సంచార జాతి కుటుంబం ఎలా ఎదుర్కొంది? తమకే కాక, ఊరందరికీ ఆ దొర పీడను ఎలా వదిలించింది... అన్న ఇతివృత్తం తో సాగే ఈ నవల ఆద్యంతం ఆసక్తికరంగా చదివిస్తుంది.
రచన: నరసింహ గుమ్మనేని
Similar products