Search for products..

Home / Categories / Our Publications /

Ghatikapuri

Ghatikapuri




Product details

ఆంధ్రదేశమును శాతవాహనులు పరిపాలించిన తదనంతరం పాలించిన రాజవంశీయులలో విష్ణుకుండినులు ముఖ్యులు. వీరి పాలన మహోజ్జ్వల చరిత్ర. దాదాపు మూడు వందల సంవత్సరాలు(క్రీ.శ.358 నుండి 624) పరిపాలించి ధర్మం నిలిపారు. ప్రజారంజక పరిపాలకులుగా పేరు తెచ్చుకున్నారు. విద్యను వ్యాప్తి చేసారు. సంస్కృతం పోషించారు. విదేశీయులతో వర్తకము చేశారు. నాణ్యాలు ముద్రించారు. శైవ దేవాలయాలను విరివిగా కట్టించారు. కళలను పోషించారు. ఆంధ్రదేశములోని గుహాలయాలు వీరు నిర్మించినవే.

బ్రాహ్మణ రాజ వంశీయులైన విష్ణుకుండినులలో రెండవ మాధవ వర్మ పాలన స్వర్ణయుగంగా పేరుపొందింది. ఈయనకు ఇద్దరు భార్యలు. ఈయన చిన్నభార్య వాకాటక రాణి. విశాల వాకాటక సామ్రజ్యము మాధవవర్మ ఏలుబడిలోకి రావటానికి కారణము ఈమెతో వివాహమే.
ఆయన తదనంతరం పట్టపురాణి కుమారుడైన దేవవర్మ రాజ్యానికి వచ్చాడు. అతను ప్రమాదవశాత్తూ రెండేళ్ళలో మరణించాడు. తదనంతరం దేవవర్మ కుమారుడు మూడవమాధవవర్మ రాజ్యానికి వచ్చాడు.

ఇతను బలవంతుడు. ఇతను విజయవాటిక (బెజవాడ) రాజధానిగా పరిపాలన సాగించాడు. ఇతని ఏలుబడిలో విష్ణుకుండిన చరిత్ర మలుపు తిరిగినది. రెండవమాధవవర్మకు, చిన్నభార్య వాకాటక మహారాణి కలిగిన కుమారుడు విక్రమేంద్రవర్మ. ఈయన రాజ్యానికి యువరాజు. మూడవ మాధవవర్మ , విక్రమేంద్రవర్మల సంబంధ బాంధవ్యాలు ఎంతో ముఖ్యమైనవి. చరిత్రలో వీరి మధ్య నడిచిన కథ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. అదే ఈ నవలకు ముఖ్య భూమిక.

Ghatikapuri - ఘటికాపురి

రచన: సంధ్యా యల్లాప్రగడ

పేజీల సంఖ్య: 160

Year of publication: 2023

Published by: Acchamga Telugu Publications

price: 150rs

 


Similar products


Home

Cart

Account