
Product details
రచయత శ్రీ రమేష్ గారు, అందరికీ ఉపయోగపడే విషయాల గురించి భగవద్గీతలో ఎక్కడెక్కడ చెప్పబడింది అని పరిశీలిస్తూ “గీతలోని మార్గదర్శకాలు” అనే శీర్షిక క్రింద ఒక్కో అంశాన్ని గురించి శ్రీకృష్ణుడు వేర్వేరు అధ్యాయాలలో ఎక్కడెక్కడ చెప్పాడో తెలియబరచే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా మనందరి కర్తవ్య పాలన గురించిన విషయాన్ని తీసుకుని “కర్తవ్య బోధన” క్రింద చిన్న పుస్తకం తయారు చేసి 2005లో విడుదల చేశారు. దాన్ని ఇప్పటికి నాలుగు సార్లు మరు ముద్రణ చెయ్యడం జరిగింది. తరువాతి విషయంగా మనందరం మన దైనందిన నడవడికలో అలవరచు కోవాల్సినట్టి “స్థితప్రజ్ఞత” గురించిన శ్లోకాలను క్రోడీకరించి వాటి తాత్పర్యం, తన వ్యాఖ్యానంతో వెలికి తెచ్చారు. అది 2018 లో విడుదలైంది. దాన్ని శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రిగారు తమ అమృత హస్తాలతో విడుదల చేసి ఆశీర్వదించారు.
ఈ వరసలో తన మూడో ప్రయత్నంగా ‘త్రిగుణాలు’ పుస్తకాన్ని మీ అందరి ముందుకు తెచ్చారు.
Geetaloni Trigunalu - గీతలోని త్రిగుణాలు
రచన: చందకచర్ల రమేష్ బాబు
పేజీలు : 80
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- అచ్చంగా తెలుగు ప్రచురణలు
ధర : 50 రూ.
Similar products