
Product details
గాయత్రీదేవి ఓజస్సని శక్తిస్వరూపిణి యని, దీప్తి స్వరూపిణి యని దేవతల యొక్క తేజస్సని జగద్రూపిణి యని, సకలపాప హారిణియని, ప్రణవస్వరూపిణి యని మహర్షుల మహిమోక్తుల ద్వారా శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారు తెలియ జేసిరి. గాయత్రీ శబ్ద స్వరూపమును అర్థమును, అంతర్లీన ఛందస్సాద్యనేక కాంశములను ముని ప్రవక్తాదుల నాధారముగా స్పష్టముగా తెలియజేసిరి. గాయత్రీ స్వరూపమే రామాయణమని గాయత్రీ రామాయణమును ఈ గ్రంథమున తెలియజేసిరి. వాల్మీకి, ఆంజనేయ ప్రార్థనలను తెలిపిరి. గాయత్రీ ధ్యానమును, గాయత్రీ సహస్రనామావళిని నిత్యపఠన యోగ్యముగా తెలిపిరి. శ్రీ గాయత్రుపనిషత్తును నిత్య జప వినియోగముగా తెలియజేసిరి. అట్లే సావిత్రుపనిషత్తును కూడా తెల్పిరి. గాయత్రీ శక్తి వర్ణాదితోబాటు గాయత్రీ కవచమును, గాయత్రీ హృదయమును, గాయత్రీ స్తోత్రమును, గాయత్రిని గూర్చి దివ్యమహర్షులు చెప్పిన సువచనములను కవిశ్రీ గొల్లపూడి సుబ్రహ్మణ్య శర్మగారు తెలియజేసిరి.
పుస్తకం పేరు: గాయత్రీ తత్వ రహస్యము
రచయిత: కీ.శే.బ్రహ్మశ్రీ గొల్లపూడి సుబ్రహ్మణ్య శర్మ
పేజీల సంఖ్య: 140
ప్రచురించిన సంస్ధ: Self
ప్రచురించిన సం. 2021
ధర: 100రూ.
Similar products