మనిషి అంతరిక్షానికా వెళ్లినా, అంటార్కటికా వెళ్లినా అతడే అందరికంటే గొప్పవాడు కాదు. అందరినీ మించిన అద్భుత శక్తి ఒకటి ఉంది. అదే దేవుడు… దైవం…
గత ముప్పై సంవత్సరాలుగా భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పునుండి పడమర దిక్కు వరకు 2,00,000 కిమీ. పైగా ప్రయాణించి, ఆ భగవంతుడి ఉనికిని వివిధ రూపాలలో అనుభూతి చెందారు వెంకట వినోద్ పరిమి. తన అనుభవాలు, అనుభూతులనుండి కొన్నింటిని “దైవంతో నా అనుభవాలు ” అనే పుస్తకంగా అందజేస్తున్నారు సింగపూర్ లో నివసించే రచయిత వినోద్.
మంచి క్వాలిటీతో రెండువేల కాపీలతో ప్రింట్ కి వెళ్లి, వారంలో ఇంకో వెయ్యి కాపీల ప్రింట్ అవసరం అవుతున్న మొదటి పుస్తకం ఇది..
ఈ పుస్తకం అమ్మకాల సొమ్ము గోశాలలకు పంపబడుతుందని రచయిత తెలుపుతున్నారు.
Daivamto Naa Anubhavalu - దైవంతో నా అనుభవాలు
రచన: వెంకట వినోద్ పరిమి
పేజీలు : 196
ప్రచురించిన సంవత్సరం- 2020
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర : 200 రూ.