రసాత్మకమైన వాక్యమే కావ్యమౌతుందని అన్నారు. అందులోనూ ప్రస్తుతం నేటి యువకవులు ఇన్స్టా లో ఆక్టివ్ గా ఉంటూ, చిరు కవితలతో మంచి ఆదరణ పొందుతున్నారు. ఈ క్రమంలో చంద్రబోస్ గారి ముందుమాటతో హైక్వాలిటీ తో మా నుంచి వచ్చిన పుస్తకమే ‘చురకలు’!
ఇవి లోకం పోకడ మీద, మారుతున్న మనస్తత్వాల మీద, విసిరిన చురకలు! ప్రతి మనిషీ ఆత్మసమీక్ష చేసుకుని, తమలోకి తరచి చూసుకోవాల్సిన అవసరాన్ని తెలిపే తళుకులు. మచ్చుకు కొన్ని మీకోసం…
“అనుకోకుండా కలిసిన కొన్ని పరిచయాలు
అన్నీ అనుకున్నాకా విడిపోతాయి!”
“ఎప్పుడూ చెయ్యందించే వాళ్లకే
అవసరమైనప్పుడు అంతా
హ్యాండిస్తూ ఉంటారు…”
“నా ధైర్యం
నన్ను ముందుండి నడిపించేవాళ్లయితే,
నా బలం
నన్ను వెనక్కు లాగేవాళ్లు!”
Churakalu - చురకలు
రచన: కొండలరావు అడ్డగళ్ళ
పేజీలు : 88
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- అచ్చంగా తెలుగు ప్రచురణలు
ధర : 149 రూ.