ఈకథల్లో అడుగడుగునా అద్భుతమైన మధుధారలున్నాయి!
అవి బుగ్గన చుక్కతో, ‘కిజ్క్ఞిణి’ శబ్దాలతో అందరి మనసుల్నీ మాయ చేసే ఆ జగన్మోహనుడైన బాలకుని కథలతో మొదలవుతాయి. మనలో ఉన్న యశోదను, మాతృవాత్సల్యాన్ని జాగృతం చేస్తాయి. ఒక్కసారి ఆ బాలకృష్ణుడిని ఎత్తుకుని, హత్తుకుని ముద్దాడాలన్న కోరిక రేపుతాయి. గోకులంలో ఉన్నవారి మనసులనే ఉట్లను కొల్లగొట్టి, అందులోని నవనీతం వంటి ఆర్ధ్రతను వెలికితీసి, నిలువెల్లా కరిగింపచేసే ఈ పరమానందం, చదువుతుండగానే ‘శింజన్నూపుర ధ్వనితో సంజలలో వచ్చి, సమ్మోహన వేణుగానం చేసే కృష్ణుడిగా’ మారిపోతుంది.
ఒక్కొక్క ప్రాణిని అత్యంత నమ్రతతో ఆదరించి, అక్కున జేర్చుకోవడంలోనే కృష్ణుడి ఔదార్యం ఉంది. ఈ సమస్త లోకాలను సృష్టించిన దేవదేవుడి ఉదాత్తతను ఆశ్చర్యంతో చదువుతుండగానే యశోదగా, గోపికగా, సేవికగా మారిన మన మానసాలు, భృంగాల్లా ఆయన చుట్టూ పరిభ్రమిస్తూ ఉండగానే కృష్ణకథామృతం ముగిసి, పోతన కథలు, రామ కథలు, త్యాగరాజ స్వామివారి కథలు, రమణ మహర్షి కథలు, వాసిష్ట కథలు, అన్య కథలు మనల్ని స్వాగతిస్తాయి. ముముక్షువులను లోతుగా ఆలోచింపజేస్తాయి. చక్కని ఈ పుస్తకాన్ని కొనండి, చదవండి.
Brundavana Saranga - బృందావన సారంగ
రచన: జొన్నలగడ్డ సౌదామిని
పేజీలు : 320
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- అచ్చంగా తెలుగు ప్రచురణలు
ధర : 200 రూ.