
Product details
ఆఖరి ప్రయాణం.
తల్లి నుంచి మాత్రమే మొగపిల్లలకి సం క్రమించే బ్లడ్ డిసార్డర్ హీమోఫీలియా మీద తెలుగు లో వచ్చిన మొదటి నవల.
హీమోఫీలియా మూలంగా చిన్న సాయికి చాలా సార్లు రక్తం ఎక్కించాల్సి వస్తుంది.
కాని,ఒకసారి హెచ్ ఐవీ ఉన్నరక్తం ఇవ్వడంతో, చిన్న సాయికి
హెచ్ ఐవి సోకుతుంది. ఆ తరవాత ఆ వైరస్ మెల్లిగా క్రమంగా ఆ పిల్లాడి సిస్టంస్ మీద ఒక దాని తర్వాత ఒకటి ప్రభావం పడి ఆరేళ్ల తరవాత ఎయిడ్స్ బారిన పడతాడు.
ఓ నలభై ఏళ్ళ క్రితం పరీక్ష్తం చేయకుండానే, రక్తం ఎక్కించాల్సి వస్తే ఎవరో ఒకళ్ళది గ్రూపు చూసి ఇచ్చేవారు. అటువంటప్పుడు రక్తం లో ఏవైనా వైరస్ లు అవీ ఉంటే రక్తం తీసుకున్న వ్యక్తికి వచ్చే అవకాశాలు ఎక్కువ.
కాని ఇప్పుడు అలా కాదు
రక్తం లోని ఏ కాంపోనెంట్ కావాలో దానిని వేరు చేసి పేషెంట్ కి, ఇస్తున్నారు. అయితే ఈ
హీమోఫీలియా తల్లి నుంచి మొగపిల్లలందరికీ రావాలని లేదు.
ఈ నవలలో పెద్ద కొడుకు కి వస్తుంది, రెండో కొడుకు కి రాదు. ఇదే చిన్న సాయి ఆఖరి ప్రయాణం.
Akhari Prayanam - ఆఖరి ప్రయాణం
రచన: గంటి భానుమతి
పేజీలు : 156
ప్రచురించిన సంవత్సరం- 2011
ప్రచురించిన సంస్థ- స్వీయ ప్రచురణ
ధర : 100 రూ.
Similar products